telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఎవరిదారి వారిదే.. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది.. అశోక్

election officer ashok on pulwama

పుల్వామా కు బదులు తిర్చుకుంటున్న భారత్ తొలిదాడి విజయవంతంగా పూర్తిచేసింది. అయితే దీనితో పాక్ ప్రతీకారాన్ని దిగే అవకాశాలు లేకపోలేదు. దీనితో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అలాగే మరోవైపు దేశంలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ సన్నాహాలు చేస్తున్న నేపధ్యంలో జరిగిన రెండు ప్రధాన ఘటనలను ఈసీ గమనిస్తోంది. ఫిబ్రవరి 14వతేదీ అనంతరం పుల్వామా ఉగ్ర దాడి అనంతరం జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నామని భారత ఎన్నికల సంఘం ప్రధానాధికారి అశోక్ లావాసా చెప్పారు.

మహారాష్ట్రలో సాధారణ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి అశోక్ లావాసా ముంబయి నగరాన్ని సందర్శించారు. దేశంలో పుల్వామా ఉగ్రదాడి అనంతరం జరిగిన పరిణామాలను ఈసీ గమనిస్తుందని, రాజ్యాంగం ప్రకారం విధులు నిర్వర్తిస్తుందని అశోక్ చెప్పారు. మహారాష్ట్ర ఎన్నికల అధికారులు, పోలీసులు, ఆదాయపుపన్నుశాఖ, ఎక్రైజ్, రైల్వే, బ్యాంకుల అధకారులతో ఎన్నకల ఏర్పాట్లపై సమీక్షించానని అశోక్ పేర్కొన్నారు. నకిలీ ఓటర్లపై ఓ రాజకీయ పార్టీ నేతలు తమకు ఫిర్యాదు చేశారని, దీనిపై 15రోజుల్లోగా పరిష్కరిస్తామని చెప్పారు. మహారాష్ట్రలో 95,473 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, మొట్టమొదటిసారి వీవీప్యాట్ లను ప్రవేశపెడుతున్నట్లు ఎన్నికల ప్రధానాధికారి వివరించారు.

Related posts