పాకిస్తాన్ లో 22 వేలకు చేరిన పాజిటివ్ కేసులు కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. బుధవారం ఉదయానికి పాకిస్థాన్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22,263కు చేరింది. కాగా వారిలో 6,217 మంది పూర్తిగా కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. మిగతావారు వివిధ ఆస్పత్రుల్లోని ఐసోలేషన్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు.
ఈ మహమ్మారి బారినపడి 500 అంతకంటే ఎక్కువ మరణాలు సంభవించిన దేశాల జాబితాలో పాకిస్థాన్ కూడా చేరింది. కాగా పాకిస్థాన్‌లో లాక్‌డౌన్ నిబంధనల సడలింపుపై ఈ రోజు ఆ దేశానికి చెందిన నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం కానుంది. ఏ వ్యాపారాలకు అనుమతి ఇవ్వాలనే అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయింది: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి