telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అందరి చూపు.. ఏపీ అసెంబ్లీ వైపే..

Ap Assembly

ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల నేపధ్యం లో అందరి దృష్టి ఈ రాష్ట్రంపైనే కేంద్రీకృతం అయింది. శీతాకాల అసెంబ్లీ సమావేశాల చివరి రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం లో మూడు రాజధానుల ఏర్పాటు ప్రతిపాదన చేసిన విషయం తెల్సిందే. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం నియమించిన జీఎన్ రావు నిపుణుల కమిటీ, బోస్టన్ సంస్థ ఇచ్చిన నివేదికలు కూడా అభివృద్ధి వికేంద్రీకరణ కోసం మూడు రాజధానుల ఏర్పాటు చేయాలని సూచించాయి. దీనితో రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ కమిటీ వేసి, జీఎన్ రావు కమిటీ, బోస్టన్ సంస్థ నివేదికలను అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఆ రెండు నివేదికలను ఇప్పటికే మూడుసార్లు సమావేశమైన హైపవర్ కమిటీ అధ్యయనం చేసి తన నివేదిక ను సోమవారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. కేబినెట్ భేటీ లో హైపవర్ కమిటీ నివేదికను ఆమోదించి, అనంతరం అసెంబ్లీలో చర్చించనున్నారు.

రాష్ట్రం లో మూడు రాజధానుల ఏర్పాటు కు ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించిన విషయం తెల్సిందే. అమరావతిని శాసన, విశాఖ ను పరిపాలన, కర్నూల్ ను న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే ప్రధాన ప్రతిపక్షం , ప్రభుత్వం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దానిలో భాగంగానే సోమవారం అసెంబ్లీ ముట్టడికి అమరావతి రైతులిచ్చిన పిలుపుకు మద్దతునిస్తుంది. అసెంబ్లీ సమావేశాల నేపధ్యం లో సభ బయట ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశాలుండడం తో ఇప్పటికే పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తూ, సభలు, సమావేశాలు, ర్యాలీలు నిషేదించారు. సభ బయట పరిస్థితి ఎలా ఉన్న సభ లో ఏమి జరగనుందనేది ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ప్రపంచ నలుమూలల ఉన్న తెలుగు వారి కళ్లన్నీ, రేపు ఉదయం ఏపీ అసెంబ్లీపైనే కేంద్రీకృతం కావడం ఖాయం.

Related posts