దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరచుకున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలపై రాజకీయ పార్టీలు అపోహలు సృష్టిస్తున్నాయని ఆయన విమర్శించారు. మద్యం అమ్మకాలపై నిర్ణయం పూర్తిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని అన్నారు.
వివిధ రాష్ట్రాల వినతుల మేరకు కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చిందని, మద్యం విక్రయాలపై నిర్ణయం రాష్ట్రాలకే వదిలేసిందని స్పష్టం చేశారు. కేంద్రం ఆదేశించడం వల్లే రాష్ట్రంలో మద్యం విక్రయాలు జరుపుతున్నామని ఏపీ మంత్రులు చేసిన ప్రకటనలు కరెక్టు కాదని అన్నారు. ఏపీ మంత్రులు చెబుతున్నదే నిజమైతే, మిగతా రాష్ట్రాల్లో మద్యం విక్రయాలు ఎందుకు జరగడంలేదని ప్రశ్నించారు.