telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కరోనాను అరికట్టడం పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు…

Harish Rao TRS

ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఇంటింటా కోవిడ్ ఫీవర్‌ సర్వే పై… గ్రామ స్థాయిలో కోవిడ్ నియంత్రణకు నిర్వహించే ఇంటింటా కోవిడ్ ఫీవర్‌ సర్వే  666 బృందాల ద్వారా జరపనున్నట్లు తెలిపారు. ప్రతి రోజూ సాయంత్రం సర్వే బృందాల పని తీరును నాతో పాటు జిల్లా యంత్రాంగం మానిటరింగ్ చేస్తుంది. స్థానిక సర్పంచ్, వార్డు మెంబర్, కార్యదర్శి, ANM, అంగన్వాడీ, ఆశ, VOA లతో బృందాలు ఉంటాయి. సర్వే లో వ్యాధి లక్షణాలు ఉంటే ప్రభుత్వం అందించే మందులు కిట్ లను వెంటనే ఇవ్వాలి. ప్రభుత్వం అందించే మందుల కిట్ ద్వారా ఎలాంటి దుష్పరీ మానాలు ఉండవు. వచ్చే 3 వారాలు ధాన్యం కొనుగోలు మినహా మిగతా పనులు అధికారులకు బంద్ అని అన్నారు. సాముహిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. తప్పనిసరయితే కేవలం 100 మందికే పరిమితం కావాలి. ఆక్సీజన్ లెవెల్ 94 శాతం కంటే తక్కువ ఉంటే 108 ద్వారా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఐ సోలేషన్ కేంద్రాలకు తీసుకు రావాలి. ప్రారంభము లోనే వ్యాధిని గుర్తించి తగిన చికిత్స ఉంటే వ్యాధి నుంచి బయట పడవచ్చు. మాస్క్ ధరించనీ వ్యక్తులకు రూ.500 జరిమానా విధించండి అని తెలిపారు.

Related posts