ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పిస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తున్న ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తున్నట్లు ప్రకటించారు. కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నట్లు శనివారం ఆయన వెల్లడించారు. ఈ వార్తను ట్విటర్‌లో తన అభిమానులతో పంచుకున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా సీఎం కేసీఆర్‌తో కలిసి ఆయన పలు అంశాలపై చర్చించారు. ప్రకాశ్‌రాజ్ రాజకీయ ప్రకటనపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదివరకే అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే.