telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కరోనాతో వాల్టర్ రీడ్ ఆసుపత్రిలో చేరిన ట్రంప్‌

trump usa

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఆయన సతీమణి మెలానియా ట్రంప్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ట్రంప్ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా నిన్న ప్రకటించారు. కొన్ని గంటల పాటు హోం క్వారంటైన్‌లో ఉన్న ట్రంప్‌ తర్వాత వాల్టర్ రీడ్ ఆసుపత్రిలో చేరారు.

తమ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని చెప్పారు.’ఇంతగా మద్దతు ఇస్తున్నందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. నేను ఆసుపత్రికి వెళుతున్నాను. నా ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని నేను అనుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. తన భార్య మెలానియా ఆరోగ్య పరిస్థితి కూడా బాగానే ఉందని ట్రంప్ తెలిపారు. అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు. ట్రంప్‌ కొన్ని రోజుల పాటు వాల్టర్ రీడ్ మిలిటరీ ఆసుపత్రి నుంచే పనిచేస్తారని వైట్‌హౌస్‌ తెలిపింది.

Related posts