telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కొత్త లుక్ తో అభిమానులకు షాకిచ్చిన కీర్తి… మరీ ఇంతగానా…!

Keerthy-Suresh

దక్షిణాది స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. ‘మహానటి’ సినిమాతో జాతీయస్థాయి గుర్తింపు సంపాదించుకుంది కీర్తి సురేష్. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ‘మిస్ ఇండియా’ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ అమ్మడు అటు తమిళ్ సూపర్ స్టార్ రజినీ కాంత్ తో ‘అన్నాత్తే’ చిత్రంలో, తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’ సినిమాలు చేస్తుంది. కీర్తి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న “గుడ్‌ లక్‌ సఖి “, అదే విధంగా యంగ్ హీరో నితిన్ తో ‘రంగ్ దే ‘ చిత్రంలోనూ నటిస్తుంది. అంతేకాదు కీర్తి మరో అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్‌ “రాఘవన్-2″లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్టు సమాచారం. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉంది కీర్తి. బయటే కాదు సోషల్ మీడియాలో కూడ ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువే. తాజాగా కీర్తి తన ఇన్స్టాగ్రామ్ లో టీ, కాపీ, చెన్నై సిటీ పట్ల తన ప్రేమను తెలుపుతూ ఒక పోస్ట్ చేశారు. అయితే అందులో కీర్తి సురేష్ లుక్స్ ఎక్కువగా ఆకట్టుకున్నాయి. ఇందులో కీర్తి చాలా స్లిమ్ గా, గుర్తుపట్టలేనంతగా సన్నబడిపోయింది. దీంతో ఆమె అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొంపదీసి సైజు హీరో ఎమన్నా ట్రై చేస్తున్నావా ? ఎందుకు ఇంత సన్నగా మారిపోయావు? అంటూ ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.

Related posts