telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సినిమా వార్తలు

అనారోగ్యంతో బాలీవుడ్ నటుడు మృతి

actor-viju-khote-died

ప్రముఖ బాలీవుడ్ నటుడు వీజూ కోఠె (77) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హిందీ, మరాఠీ భాషల్లో 300కు పైగా సినిమాల్లో నటించారు. కాళీ, సోలీ పేర్లతో ఆయన పాపులర్‌గా నిలిచారు. 1964 సంవత్సరంలో యా మలక్ చిత్రంలో చేసిన పాత్ర తన సినీ జివితాన్ని మార్చేసింది.

షోలే, అందాజ్ అప్నా అప్నా, ఖుర్బాని, ఖర్జ్, నగీనా, చైనాగేట్ తదితర చిత్రాల్లో నటించారు. వీజూ కొఠె అక్క శుభ కోఠె కూడా సీనియర్ నటి. తండ్రి నందూ కొఠె రంగస్థల నటుడు, అత్త దుర్గ కొఠె ప్రముఖ నటి. ఆయన నటించిన చివరి చిత్రం జానే క్యొ దె యారాన్.

Related posts