telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ నెక్స్ట్ మూవీ ?

Vijay

తమిళ స్టార్ హీరో విజయ్… ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో చేయడానికి సిద్ధమవుతున్నారు. ఎన్నో నెలల నుండి అనుకుంటున్న ఈ ప్రాజెక్ట్ లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. మళ్లీ ఆరు నెలల తర్వాత సినిమా మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. 2021 జనవరిలో సంక్రాంతి కానుకగా ఈ సినిమాను లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు. ఫిబ్రవరి నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇందులో కథానాయకిగా కాజల్ అగర్వాల్, తమన్నాల పేర్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు స్టోరీ ‘తుపాకి’ తరహాలోనే ఉంటుందని, టైటిల్ ‘తుపాకి 2’ అని, ఇది తప్పకుండా సీక్వెలేనని కోలీవుడ్ వర్గాల టాక్. గతంలో విజయ్, మురుగదాస్ కాంబినేషన్లో రూపొందిన ‘తుపాకి, కత్తి, సర్కార్’ చిత్రాలు భారీ విజయాలను సాధించి ఉండటంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇక ప్రస్తుతం విజయ్… లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘మాస్టర్’ సినిమా చేస్తున్నారు. దాదాపు అంతా పూర్తైపోయిన ఈ చిత్రం త్వరలోనే విడుదలకానుంది.

Related posts