telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జైలు వద్ద సంజన హంగామా ?

Sanjana

కన్నడ సినీ పరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్స్ కుంభకోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో నటి రాగిణి ద్వివేదికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. దాంతో ఆమెను బెంగుళూరు లోని పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఇక ఇదే కేసులో నటి సంజన, రాహుల్, వీరేన్ ఖన్నా, ప్రభుత్వ ఉద్యోగి రవిశంకర్ తదితరులు అరెస్టు అయ్యారు. అయితే పెద్ద జైలును చూడగానే సంజన బెదిరిపోయిందట. అలాగే తొలిసారి జైల్ ని చూడగానే సంజన కాస్త కంగారు గానే కనిపించిందిట. లోపలికి వెళ్లేందుకు మొండికేసిందని, తర్వాత చిన్న గేటునుంచి కాకుండా పెద్ద గేటు నుంచి వెళ్తానంటూ హంగామా చేసిందట అక్కడున్న అధికారులు బెదిరించడంతో చిన్న గేటునుంచి లోపలికి వెళ్లిందని ప్రచారం జరుగుతుంది. నటి రాగిణి, సంజనా డ్రగ్స్ సేవించామని అంగీకరించారని ఇటీవల పోలీసులు పేర్కొన్నారు. డ్రగ్స్ వ్యవహారం బయటపడిన వెంటనే రాగిణి, సంజన తమ మొబైల్స్‌లోని డేటాను మొత్తం డిలీట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

Related posts