telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అనసూయ కష్టాలు … జన్మదిన శుభాకాంక్షలు..

Anasuya images

నేడు హాట్ యాంకర్ అనసూయ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనసూయ తన చిన్నతనంలో తాను పడ్డ కష్టాలను వివరించింది. తన చిన్నప్పుడు తన తండ్రి చేసే చిన్నచిన్న వ్యాపారాలు వల్ల వచ్చే ఆదాయం తమకు ఏమాత్రం సరిపోవకపోవడంతో తన తల్లి ఆకష్టాల నుండి బయటపడటానికి జాకెట్లు చీరలు కుడుతూ కుటుంబాన్ని నెట్టుకు వచ్చిన విషయాలను గుర్తుకు చేసుకుంది. అంతేకాదు తన చిన్నతనంలో తమకు సరైన బట్టలు కొనడానికి కూడ తన తల్లి పడ్డ కష్టాలను తెలియచేస్తూ ఆ కష్టాల వల్ల తనలో కసి పెరిగి జీవితంలో విజయం సాధించాను అంటూ తన సక్సస్ సీక్రెట్ ను బయట పెట్టింది. అంతేకాదు తాను తన భర్త భారద్వాజను పెళ్లి చేసుకునే సమయంలో పెళ్లి ఖర్చుల కోసం అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది అంటూ తన గతాన్ని తన అభిమానులతో షేర్ చేసుకుంది అనసూయ.

బుల్లితెర రంగంలో అదేవిధంగా సినిమాలలో రాణించాలి అంటే చాల ఓర్పు ఉండాలని, అలాంటి ఓర్పు తాను చిన్నతనంలో పడ్డ కష్టాలు తనకు నేర్పాయి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. తన భర్త భరద్వాజ సహకారం లేనిదే తాను ఈ స్థాయిలోకి వచ్చి ఉండే పరిస్థితి లేదు అంటూ టివి సినిమాల రంగంలో స్త్రీలు రాణించాలి అంటే కుటుంబ సహకారం ఎంత అవసరమో వివరంగా వివరించింది ఈ హాట్ యాంకర్.

ఆమె మరొక ట్విస్ట్ ఇస్తూ తనకు ఇద్దరు పిల్లలు ఉన్నా తనకు కూతురు లేదు అన్నలోటు కనిపిస్తోందనీ అందువల్ల ఈ భావం తనలో మరింత పెరిగిపోతే తాను కూతురుని కనే అవకాసం ఉంది అంటూ లీకులు ఇవ్వడమే కాకుండా దీనికోసం అవసరం అయితే తన కెరియర్ కు బ్రేక్ ఇవ్వడానికి కూడ తాను సిద్ధం అంటూ మరో ట్విస్ట్ ఇచ్చింది. ఆమె ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలను ఈ ఇంటర్వ్యూలో షేర్ చేస్తూ త్వరలో తాను కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి సినిమాలో కనిపించబోతున్నట్లు లీకులు ఇచ్చింది..

Related posts