telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అమితాబ్ బచ్చన్ పట్ల తాను చేసిన వ్యాఖ్యలకు కు పశ్చాత్తాపపడుతున్నా…! అమర్ సింగ్

amitab-amarsingh

అమితాబ్ బచ్చన్ పట్ల తాను చేసిన వ్యాఖ్యలకు కు పశ్చాత్తాపపడుతున్నానని సమాజ్ వాదీ పార్టీ మాజీ నాయకుడు అమర్ సింగ్ అన్నారు.ఈ రోజు మా నాన్న గారి వర్థంతి. అమితాబ్ బచ్చన్ గారి నుంచి నాకు మెసేజ్ వచ్చింది. జీవితం,చావుతో నేను పారాడుతున్న ఈ స్టేజీలో అమితాబ్ బచ్చన్,ఆయన కుటుంబం పట్ల చేసిన ఓవరాక్షన్ పట్ల పశ్చాత్తాప్పడుతున్నాను. దేవుడు వారందరినీ చల్లగా చూడాలి అంటూ అమర్ సింగ్ ట్వీట్ లో తెలిపారు. కొన్ని సంవత్సరాల నుంచి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తాను జీవితం,చావుతో పోరాటం చేస్తున్నానని అమర్ సింగ్ తెలిపారు.కొన్నేళ్ల క్రితం వరకు అమర్ సింగ్,అమిత్ బాబ్ బచ్చన్ మంచి మిత్రులే. అయితే గొడవల కారణంగా వీరి మధ్య స్నేహ బంధాలు తెగిపోయాయి. అమితాబ్ బచ్చనే తనతో ఫ్రెండ్ షిప్ కట్ చేసుకున్నాడని సింగ్ తెలిపారు. జయాబచ్చన్,అమితాబ్ బచ్చన్ వేర్వేరుగా ఉంటున్నారని కొన్నేళ్ల క్రితం అమర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.2017లో ఓ ఇంటర్వ్యూలో సింగ్ మాట్లాడుతూ…తాను అమితాబ్ బచ్చన్ ను కలవడానికి ముందే అమితాబ్,ఆయన భార్య జయా బచ్చన్ వేర్వేరుగా ఉంటున్నారని,ఒకరు ప్రతీక్షాలో నివాసముంటుండగా,మరొకరు తన వేరొక బంగ్లా జనక్ లో ఉంటుండేవారని తెలిపారు. ఐశ్వర్య రాయ్ బచ్చన్, జయ బచ్చన్ ల మధ్య సమస్యల గురించి కూడా ఊహాగానాలు వచ్చాయని దానికి తాను బాధ్యుడిని కాదని సింగ్ అన్నారు. అంతేకాకుండా జయాబచ్చన్ యొక్క సమాజ్ వాదీ పార్టీ సభ్యత్వాన్ని అంగీకరించవద్దని అమితాబ్ బచ్చన్ గతంలో తనను హెచ్చరించాని కూడా అమర్ సింగ్ తెలిపారు. అయితే అమర్ సింగ్ వ్యాఖ్యలను అమితాబ్ పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. అతడు ఫ్రెండ్ అని,ఏది చెప్పాలనుకుంటున్నాడో అది చెప్పేందుకు అతనికి హక్కు ఉందని బిగ్ బీ అన్నారు.2017లో పనామా పేపర్స్ లీక్ లో అమితాబ్ బచ్చన్ పేరు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో అమర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ…పనామా కేసులో అమితాబ్ బచ్చన్ నుండి కొంత నిశ్శబ్దం ఉంది. ఇది ఖల్నాయక్ సినిమాలోని నాయక్ లుక్ లా కనిపిస్తుంది. ఓ అభిమానిగా, తన హీరో అమితాబ్ క్లీన్ గా ఉండాలని కోరుకుంటున్నట్లు సింగ్ తెలిపారు. 1990ల్లో అమితాబ్ బచ్చన్ కు చెందిన ప్రొడక్షన్ ఏబీసీఎల్ కుప్పకూలిపోయినప్పుడు అమితాబ్ ఫైనాన్స్ మరో మలుపు తీసుకున్న సమయంలో అమర్ సింగ్ బచ్చన్ కు సహాయం చేసినట్లు రిపోర్ట్ లు చెబుతున్నాయి. ఏదేమైనా, అమర్ సింగ్ జైలులో ఉన్నప్పుడు వారి స్నేహం దెబ్బతింది.

Related posts