telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అల్లు అర్జున్ కు  క్యూట్ తిట్లు… అర్హ వీడియో వైరల్…! 

Arha

అల్లు అర్జున్ “అల వైకుంఠపురంలో” చిత్రంతో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. తాజాగా బన్నీ తన కూతురితో కలిసి రికార్డ్ చేసిన క్యూట్ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ‘నీ ఫేవరేట్ కలరేంటి బే’ అని బన్నీ అర్హను అడగ్గా.. ‘పింక్ బే’ అని షాకిచ్చింది అర్హ. ‘నన్ను బే అంటావా బే’ అంటే ‘అవును బే’ అంటూ పాప చేత నాలుగు సార్లు ‘బే’ అన్న పదాన్ని పలికేలా చేసాడు బన్నీ. చూడటానికి వీడియో క్యూట్‌గానే ఉంది కానీ కొందరు నెటిజన్స్‌కి మాత్రం నచ్చలేదు. వీడియో కింద దారుణంగా కామెంట్స్ పెట్టారు. చిన్నప్పటి నుంచే పిల్లలకు ఇలాంటి పదాలు నేర్పిస్తే పెద్దయ్యాక కూడా వారు అలాగే మాట్లాడతారంటూ ట్రోల్ చేసారు. ‘అల వైకుంఠపురములో’తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న బన్నీ ప్రస్తుతం తన బెస్ట్ ఫ్రెండ్ అయిన డైరెక్టర్ సుకుమార్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ‘ఆర్య’, ‘ఆర్య 2’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ఇది. ఇంకా టైటిల్ ఏమీ అనుకోలేదు. హీరోయిన్‌ ఎవరన్నది కూడా చెప్పలేదు. షూటింగ్ మొదలైపోయింది. ఈ సారి మరో కొత్త లుక్‌తో బన్నీ ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేయబోతున్నారు. ఈ సినిమాతో పాటు ‘ఐకాన్’ అనే సినిమాలోనూ బన్నీ నటిస్తున్నారు. ఇందులో రష్మిక మందన హీరోయిన్‌గా నటించనున్నారు.

Related posts