telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“జబర్దస్త్” శాంతి స్వరూప్ తో అబ్బాయి అసభ్య ప్రవర్తన…!! 

Shanthi-swaroop

జబర్దస్త్.. ఎంత పాపులర్ షోనో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో ద్వారా చాలా మంది మంచి గుర్తింపు పొందారు. ఈ షోలో లేడీ గెటప్స్ వేసే కమెడియన్స్‌తో కూడా కొందరు అసభ్యంగా ప్రవర్తించారని ఇదివరకే కొందరు నటులు జబర్దస్త్ స్టేజ్‌పైనే వారే స్వయంగా చెప్పుకొచ్చారు. తాజాగా ఇప్పుడు మరో జబర్దస్త్ కమెడియన్ ఇలాంటి ఘటనే ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇప్పుడు ఓ షూటింగ్ స్పాట్‌లో.. ఫోన్ మాట్లాడుతున్న శాంతి స్వరూప్ దగ్గరికి వచ్చిన ఒకతను నడుంపై చేయి వేసి.. వెనుక నుంచి ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేశాడు. దీన్ని గమనించిన శాంతి.. పక్కకు తప్పుకుని చొప్పు కూడా తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇదంతా ప్రాంక్ వీడియో అని.. చివర్లో చెప్పి.. శాంతిని కూల్ చేశారు. అయినా అప్పటివరకూ వీరి మధ్య సంభాషణ చాలా హాట్‌గా సాగింది. అంతేకాదు ఈ వీడియోలో శాంతి స్వరూప్ బూతులు కూడా మాట్లాడాడు. గతంలో కూడా శాంతి పట్ల పలువురు అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా.. వేధించారంటూ చెప్పాడు శాంతి. రాత్రికి రేట్ ఎంత అంటూ.. దారుణంగా కామెంట్స్ చేశారని ఏడ్చాడు కూడా.

Related posts