telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ లో నగ్నంగా…!?

Naked-Man

కాలిఫోర్నియాలో త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఓ జంట ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్‌కు ప్లాన్ చేసుకుంది. జేక్ తనకు కాబోయే భార్య అమీ సెఫ్టాన్‌కు కాలిఫోర్నియాలోని శాన్ ఎలిజో స్టేట్ బీచ్‌లో ప్రపోజ్ చేశాడు. ఆ సెంటిమెంట్‌తో ఇదే బీచ్‌లో ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ ప్లాన్ చేసుకున్నారు. ఫొటో దిగే సమయంలో సరిగ్గా ఓ వ్యక్తి ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా వెళ్తున్న దృశ్యం ఫొటోలలో పడింది. మొత్తం ఫ్యామిలీలు తిరిగే ప్రదేశంలో ఆ వ్యక్తి నగ్నంగా ఎందుకు తిరుగుతున్నాడో అర్థం కాలేదు. తరువాత అదే వ్యక్తి బట్టలు వేసుకుని కనిపించడంతో అతనితో మరో ఫొటో దిగారు. ఈ బీచ్‌లో తామిద్దరికీ ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉన్నాయని, ఇప్పుడీ వృద్దుడి సంఘటన కూడా మరో తీపి జ్ఞాపికగా మిగిలిపోతుందని వారు అన్నారు. వృద్దుడు నగ్నంగా పడిన ఫొటోను అమీ సెఫ్టాన్ ఇన్‌స్టగ్రమ్‌లో పోస్ట్ చేయడంతో ఆ ఫొటో వైరల్ అయ్యింది.

Related posts