telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలకృష్ణ, నాగ్, ఎన్టీఆర్… నెపోటిజంపై నాగబాబు వ్యాఖ్యలు

Nagababu

సుశాంత్ సింగ్ మరణంతో నెపోజిజం ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఇదే ఇష్యూపై మాట్లాడుతూ మెగా బ్రదర్ నాగబాబు సంచలన వీడియోను విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ… “మా కుటుంబం నుంచి వచ్చిన హీరోలందరూ ఎంతో కష్టపడిన తర్వాతే తెర పైకి వచ్చారు. బన్నీ, చరణ్, వరుణ్, సాయితేజ్, నిహారిక అందరూ తమ కెరీర్ కోసం, సినిమా కోసం విపరీతంగా కష్టపడతారు. ఎన్టీయార్ కొడుకు కాబట్టే బాలకృష్ణ స్టార్‌ అయ్యారనడం సరికాదు. ఆయనకంటూ సెపరేట్ స్టైల్ క్రియేట్ చేసుకుని అభిమానులను అలరిస్తున్నారు. ఇక ఏఎన్నార్ కొడుకు కాబట్టి నాగార్జునను చూసెయ్యలేదు. ఆయన తన గ్లామర్‌తో, నటనతో `కింగ్`గా ఎదిగారు. అలాగే జూనియర్ ఎన్టీయార్ ఎంత కష్టపడతాడో నేను స్వయంగా చూశాను. ‘అరవింద సమేత’ షూటింగ్ సమయంలో 44 డిగ్రీల ఎండలో షర్ట్ కూడా లేకుండా ఫైట్ చేశాడు. అలాగే మహేష్ బాబు కాస్త లావుగా ఉండేవాడు. సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు కేబీఆర్ పార్కులో రోజూ రన్నింగ్ చేసేవాడు. చూస్తుండగానే స్లిమ్‌గా తయారైపోయాడు. కష్టపడకపోతే ఎవరికీ ఇక్కడ చోటు లేదు. దేవుడి కొడుకైనా.. అతడు నచ్చకపోతే ప్రజలు తిరస్కరిస్తారు” అని నాగబాబు అన్నారు.

Related posts