telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

తాజ్‌మహల్ దగ్గర స్టైలిష్ స్టార్ జంట…

ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలు చేస్తున్నవారిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒక్కడు. అయితే సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్నా తన కుటుంబానికి కావలసినంత ప్రాధాన్యం ఇస్తారు. సమయం దొరికినప్పుడల్లా కుటుంబంతో విహార యాత్రలకు వెళుతుంటారు. అయితే ఈ రోజు బన్నీ, స్నేహ దంపతులు 10వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బన్నీ తన భార్యతో కలిసి తాజ్‌మహల్ సందర్శించారు. ప్రేమ సౌధం ముందు తన భార్యతో బన్నీ ఫోటోలు దిగారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ కూడా చేశారు. ‘మన 10వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు క్యూటీ. ఈ పది సంవత్సరాల ప్రయాణం ఎంతో అద్భుతంగా జరిగింది. ఇకముందు కూడా ఇలాంటి మరెన్నో జరుపుకోవాల’ని బన్నీ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే బన్నీ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 13న విడుదల కానుంది. చూడాలి మరి ఈ సినిమా ఏ మేర విజయం సాధిస్తుంది అనేది.

Related posts