telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

రెండేళ్ల పాపను బ్లోటార్చ్‌తో కాల్చి… కరెంట్ షాకిచ్చి…

Florida-Man

రెండేళ్ల ఆ పాప గాఢ నిద్రలో ఉంది. ఇంతలో గట్టిగా ఓ రాయి తగలడంతో బాధగా అరిచి కళ్లు తెరిచింది. ఆమె ఎదురుగా ఓ తోడేలు మాస్క్ వేసుకున్న వ్యక్తి నిలబడి భయపెట్టాడు. ఆమెకు గుండె ఆగినంతపనై పెద్దగా కేకలు పెట్టి ఏడవసాగింది. దీన్నంతా వీడియో తీసిన ఆ దుండగుడు పకపకా నవ్వుతూ వెళ్లిపోయాడు. మరోసారి ఆమెను బలవంతంగా పట్టుకొని బ్లోటార్చ్(లోహాలను కరిగించడానికి వాడే ఓ పరికరం)తో ఆమె శరీరాన్ని అక్కడక్కడా కాల్చాడు. ఆమె బాధతో ఆర్తనాదాలు చేయడాన్ని వీడియోతీసి రాక్షసానందం పొందాడు. అలాగే మరోసారి కుక్కలకు షాక్ ఇవ్వడానికి వేసే కాలర్ తీసుకొచ్చి ఆ అమ్మాయికి వేసి, ఊరికినే కరెంట్ షాకులిచ్చాడు. రెండేళ్ల ఆ పాప శరీరంపై గాయాలు చూసిన ఆమె తల్లి.. తన కూతురికి చర్మవ్యాధి వచ్చిందని భావించింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా అది చర్మవ్యాధి కాదని, ఎవరో ఆమె శరీరాన్ని తగలబెట్టారని వైద్యులు చెప్పారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చిన ఆమె.. వారి దర్యాప్తుకు సహకరించింది. ఆమె బాయ్‌ఫ్రెండ్ రాస్ సెలాసియస్ ఈ హింసకు పాల్పడినట్టు తెలిసి షాకైంది. అతన్ని అరెస్టు చేసిన పోలీసులు అతనికి సహకరించిన మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ పాపను కేవలం శారీరంకంగానే హింసించారా లేక లైంగికదాడికి పాల్పడ్డారా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

Related posts