telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ప్రకాశం జిల్లా.. సర్వే ఏమి చెప్తుందంటే.. !!

survey on prakasham district favour to

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందర్భంగా వివిధ సర్వే ల నివేదికలు వెలువడుతున్నాయి. దీనితో ఇప్పటికే ఎన్నికల హడావుడితో ఉన్న రాష్ట్రంలో వేడి మరింత పెరిగిపోతుంది. ప్రధాన పార్టీలుగా టీడీపీ, వైసీపీ మధ్య ఉన్నటఫ్ వార్ జనంలో ఆసక్తి రేపుతున్నాయి. ఈ ఆసక్తిని చాలా సంస్థలు సర్వేలతో సమాధానం చెబుతున్నాయి. ఇటీవల ఓ సంస్థ .. అన్ని జిల్లాలోనూ జన్యూన్ గా సర్వే చేస్తున్నామని చెప్పుకుంటూ యూట్యూబ్ లో రిజల్ట్స్ పోస్ట్ చేస్తోంది. ప్రకాశం జిల్లాపై ఈ సర్వే వివరాలు చూద్దాం ఇలా ఉన్నాయి.

ప్రకాశం జిల్లా వైసీపీకి అనుకూలంగా ఉన్న ప్రాంతం.. గత ఎన్నికల్లోనూ ఇదే రుజువైంది. ఈసారి కూడా అదే ట్రెండ్స్ కొనసాగిస్తూ మరింత జోరుగా దూసుకుపోనుందిని ఈ సర్వే చెబుతోంది. మొత్తం 12 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఈ జిల్లాలో వైసీపీ 11 చోట్ల మొదటి స్థానంలో నిలిచే అవకాశం ఉంది . మరోస్థానంలో రెండవ స్థానంలో ఉండనుంది.

అధికార టీడీపీ పార్టీ కేవలం ఒకే ఒక్క స్థానం దక్కించుకునే అవకాశం ఉంది. జనసేన .. ఈ జిల్లాలో మొత్తం 12 నియోజక వర్గాల్లోనూ మూడో స్థానానికే పరిమితమవనుంది. కాకపోతే జనసేనకు ఈ జిల్లాలో 15-16 శాతం ఓటు బ్యాంకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Related posts