telugu navyamedia
రాజకీయ వార్తలు

గృహ నిర్బంధంలో ఉన్న మాజీ సీఎంలపై త్వరలో నిర్ణయం: రాజ్ నాథ్

Rajnath Singh inaugurates NIA office

పార్లమెంట్ లో ఆర్టికల్ 370 రద్దు తరువాత పోలీసులు ముగ్గురు మాజీ సీఎంలను అరెస్ట్ చేసి గృహ నిర్బంధంలో ఉంచారు. జమ్ము కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్‌ అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీల విడుదల కోసం తాను ప్రార్ధిస్తున్నానని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. వారి రాష్ట్రంలో సాధారణ పరిస్థితి నెలకొనేందుకు ముగ్గురూ సహకరిస్తారని భావిస్తున్నట్టు వెల్లడించారు.

2019 ఆగస్టు 5న జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలను కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ సీఎంలతో పాటు పలువురు రాజకీయ నాయకులను పోలీసులు అరెస్ట్ చ్శారు. ఆపై చాలా మందిని విడుదల చేసినా మాజీ సీఎం లు మాత్రం కఠినమైన ప్రజా భద్రతా చట్టం (పీఎస్‌ఏ) కింద నిర్బంధంలో ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్ధితి ప్రశాంతంగా ఉందని వ్యాఖ్యానించిన రాజ్ నాథ్, వీరి విడుదలపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి వుందని అన్నారు.

Related posts