కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన విషయం విదితమే. లాక్ డౌన్ సందర్భంగా ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేక, సినిమా నిర్మాణపు పనులు లేకుండా ఇబ్బంది పడుతున్న సినిమా రంగంలోని మహిళలకు, లైట్ మన్ లకు ఈరోజు ప్రముఖ నటుడు జగపతి బాబు నిత్యావసర సరుకులు, మాస్క్ లు పంపిణీ చేశారు. 400 మంది సినిమా కార్మికులకు బియ్యం, పప్పులు, నూనె తదితర వస్తువులు జగపతి బాబు అందించారు. ఈ కార్యక్రంలో ప్రొడక్షన్ మేనేజర్, భారతీయ జనతా పార్టీ నాయకుడు చంద్ర మధు, జగపతి బాబు మేనేజర్ మహేష్, సహాయకుడు రవి పాల్గొన్నారు.
ఇక జగపతిబాబు సినిమాల విషయానికొస్తే… విలక్షణమైన నటుడుగా జగపతి బాబు మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. తెలుగు సినిమా రంగంలో ఇప్పుడు విలన్ అనగానే వెంటనే గుర్తుకొచ్చే పేరు జగపతి బాబు. గత సంవత్సరం జగపతి బాబు నటించిన రంగస్థలం, అరవింద సమేత వీర రాఘవ సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. హీరోగా ఎంత మంచి పేరును సంపాదించుకున్నారో.. స్టైలిష్ విలన్‌గా అంతకు మించిన పేరును ప్రముఖ నటుడు జగపతిబాబు సంపాదించుకున్నారు. విలన్‌గా ఆయన చేసిన దాదాపు అన్ని సినిమాలూ మంచి కలెక్షన్లను సాధించాయి.
ఒక అగ్ర హీరోగా తన కెరీర్ లో ఏన్నో విజయాలను సాధించారు. హీరోగా ఎంతగా పేరు ప్రఖ్యాతలను సంపాదించారో ఒక తండ్రి గా, ఒక విలన్ గా ఏ పాత్రలోనైనా జీవించగల వ్యక్తీ జగపతి బాబు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ చిత్రాల్లో ఎంతో బిజీగా ఉన్నారు జగపతిబాబు.