telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అందులో తాప్సీకి ఎవరూ సాటిలేరు..

దక్షిణాదిలో ఎంత స్టార్ హీరోయిన్‌గా పేరు వచ్చినా బాలీవుడ్ అవకాశాల కోసం ప్రతి హీరోయిన్ ఎదురుచూస్తుంటారు. అదేవిధంగా ఎంతో మంది స్టార్ హీరోయిన్లు బాలీవుడ్‌ గూటికి చేరి అక్కడే సెటిల్ అయ్యారు. అదేవిధంగా బాలీవుడ్‌లో చేస్తున్న కథానాయికలు సౌత్ సినిమాలపై అంతగా దృష్టి పెట్టారు. ఎంతో తక్కువ సంర్భాల్లోనే సౌత్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. కానీ బాలీవుడ్‌లో ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేస్తున్న తాప్సి మాత్రం సౌత్‌కు ప్రిఫరెన్స్ ఇస్తోంది. బాలీవుడ్‌లో వరుస సనిమాలతో ఇంత బీజీ అయినా ఏడాదికి ఒక్క సౌత్ సినిమా అయినా చేయాల్సిందేనని తాప్సి అంటోంది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఐదు బాలీవుడ్ సినిమాలలో నటిస్తోంది. తనకు కెరీర్ మొదట్లో అవకాశాలు ఇచ్చింది దక్షణాది పరిశ్రమేనని అందుకని దానిని వదలనని తాప్సి చెప్పింది. అయితే ఒక్కసారి బాలీవుడ్ వెళ్లాక కూడా దక్షిణాదిని తాప్సి మరువలేదు. ఇంత బీజీ హీరోయిన్ అయినా తనకు మొదటి అడుగులు వేయడం నేర్పిన దక్షిణాదిని మరవడం అనేది ఆమె చేయలేదు. అందుకని అమెపై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Related posts