telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

తెలంగాణ పోలీసులకూ .. వారాంతపు సెలవు… రెండు రోజులలో అమలు..

weekly off to telangana police also in 2 days

తెలంగాణ రాష్ట్రంలోని పోలీస్ సిబ్బందికి శుభవార్త. 24 గంటలపాటు విధి నిర్వహణలో ఎంతో మానసిక ఒత్తిడిలో పనిచేసే పోలీస్ సిబ్బందికి వారాంతపు సెలవును అమలుచేసే ప్రక్రియ వేగవంతమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మరో రెండు, మూడ్రోజుల్లోనే వీక్లీ ఆఫ్ అమలుచేయనున్నారు. దీనిపై ఇప్పటికే అన్ని జిల్లాల యూనిట్ ఆఫీసర్లకు మౌఖికంగా ఆదేశాలిచ్చినట్టు నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి తెలిపారు. వెస్ట్‌జోన్ ఇంచార్జి ఐజీగా కూడా వ్యవహరిస్తున్న నాగిరెడ్డి.. రెండుజోన్ల పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు.

ప్రతి పోలీస్‌స్టేషన్‌లో సిబ్బం ది మొత్తం సంఖ్యను పరిగణనలోకి తీసుకొని.. వారంలో ఒక్కొక్కరికి ఒక్కోరోజు వారాంతపు సెలవు ఉండేలా షెడ్యూల్ రూపొందించుకోవాలని సూచించారు. డ్యూటీ రోస్టర్ చార్ట్‌లో ఒక ప్రత్యేక కాలమ్‌ను పెట్టి, రోజుకు ఇద్దరు లేదా ముగ్గురికి వారాంతపు సెలవు కేటాయించుకోవాలని ఆదేశించారు. ముందుగా సిబ్బందికి ఏరోజు వారాంతపు సెలవు తీసుకొనేందుకు అనువుగా ఉంటుందో వారినే ఎంపికచేసుకోవాలని కోరతారు.

ఏదైనా రోజుకు ఎక్కువమంది పోటీపడితే.. లాటరీ పద్ధతి అనుసరిస్తారు. రెండ్రోజుల్లోగా అన్ని పోలీస్‌స్టేషన్లలో వారాంతపు సెలవుల కేటాయింపు పూర్తిచేసి, ఎవ రు ఏ రోజు సెలవులో ఉంటారన్న సమాచారాన్ని సేకరించుకోవాలని జిల్లా ఎస్పీలను ఆదేశించినట్టు ఐజీ నాగిరెడ్డి తెలిపారు. మొత్తం సమాచారాన్ని క్రోడీకరించి చీఫ్ ఆఫీసర్‌కు పంపాలని సూచించారు.

Related posts