telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జ్ఞానులెవరూ పెళ్లి చేసుకోరు : పూరీ జగన్నాథ్

Puri

సమాజంలో ప్రజలకు ఎదురవుతోన్న, అనుభవిస్తోన్న పలు ముఖ్యమైన అంశాలపై ఇప్పటికే పోడ్‌కాస్ట్‌లు వదిలిన పూరి… తాజాగా ‘పూరీ మ్యూజింగ్స్’ అంటూ తన వాయిస్ ఓవర్‌తో ఆడియోలను విడుదల చేశారు. ఇప్పటికే ఎన్నో టాపిక్‌ల మీద వాయిస్ మ్యూజింగ్స్ విడుదల చేసిన పూరి.. తాజాగా ‘పెళ్లి’ అనే టాపిక్ మీద వివరణ ఇచ్చారు. జీవితంలో ఏమైనా సాధించాలనుకుంటే పెళ్లి చేసుకోవద్దని, ఉన్న భార్యను వదిలేయడం వల్లే రాజుల కుర్రాడు బుద్ధుడయ్యాడని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ పేర్కొన్నారు. పెళ్లి అంత మంచిదైతే ఏసు క్రీస్తు పది పెళ్లిళ్లు చేసుకునేవాడు. ఉన్న భార్యను వదిలేయడం వల్లే రాజుల కుర్రాడు బుద్ధుడయ్యాడు. ఏమైనా సాధించాలనుకుంటే పెళ్లి చేసుకోవద్దు. పెద్ద పెద్ద ఆలోచనలుంటే ఎవరికీ తాళి కట్టొద్దు. ప్రపంచమంతా తిరగాలి, ఏమైనా సాధించాలనే కసి, పట్టుదల మీకుంటే కాళ్లకి పారాణి మాత్రం రాసుకోవద్దు. ఎలాగూ నేను బుర్ర తక్కవ వాడినే, మా ఆవిడ పకోడీలు చేస్తే తింటా, సీరియల్ చూస్తా అని మీరు అనుకుంటుంటే అర్జంటుగా మీ శుభలేఖ నాకు పంపించండి. నేను వచ్చి ఆశీర్వదిస్తా. జ్ఞానులెవరూ పెళ్లి చేసుకోరు. పెళ్లి చేసుకున్న వారందరూ పెళ్లి కాని బాబా కాళ్ల మీదే పడతారు. పెళ్లి కాని హీరోయిన్‌కు ఉన్న ఫాలోయింగ్ పెళ్లి అయిన హీరోయిన్‌కు ఉండదు. కాబట్టి మిమ్మల్ని మీరు తాడుతో కట్టేసుకోకండని పూరీ పేర్కొన్నారు.

 

View this post on Instagram

 

‪👉 https://youtu.be/t7_sXiHWpW8 @charmmekaur #PC

A post shared by Puri Connects (@puriconnects) on

Related posts