telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జూన్ 8న కీర్తి సురేష్ “పెంగ్విన్” టీజర్

Penguin

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెర‌కెక్కిన చిత్రం “పెంగ్విన్”. ‘పేట’ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహించారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు. ‘పెంగ్విన్’లో కీర్తి సురేష్ గర్భవతిగా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో జూన్ 19న‌ విడుద‌ల చేస్తున్న‌ట్టు ఇటీవ‌ల‌ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. తాజాగా టీజ‌ర్ డేట్ అనౌన్స్ చేశారు. జూన్ 8న చిత్రానికి సంబంధించి టీజ‌ర్ విడుద‌ల చేయ‌నున్నారు. లాక్‌డౌన్ వల‌న ద‌ర్శ‌క నిర్మాత‌లంద‌రు ఓటీటీల వైపు క్యూ క‌డుతున్నారు. ఫైనాన్షియర్ల దగ్గర నుంచి తెచ్చిన డబ్బుకు వడ్డీలు కట్టలేని ప‌రిస్థితుల‌లో నిర్మాత‌లు త‌మ చిత్రాల‌ని డిజిటల్ ప్లాట్‌ఫాంలలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. తెలుగులో ఇప్పటికే ‘అమృతరామమ్’ సినిమా నేరుగా ఓటీటీలో విడుద‌ల కాగా, తమిళంలో జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన ‘పొన్మగల్ వందాల్’ సినిమా అమేజాన్‌లో విడుద‌లైంది. హిందీ చిత్రం గులాబో సితాబో, శ‌కుంతల దేవితో పాటు ప‌లు చిత్రాలు కూడా ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది.

Related posts