telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రభాస్ సినిమా కోసం దీపికాకు షాకింగ్ రెమ్యూనరేషన్…!!?

Deepika-Padukone

యంగ్ రెబల్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో మరో సినిమా చేస్తున్నాడు. ఇది కేవలం పాన్ ఇండియా సినిమా కాదని, పాన్ వరల్డ్ సినిమా అంటూ అశ్విన్ అంచనాలను పెంచేశాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించేందుకు దీపికా పడుకోణె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి దీపికా రెమ్యునరేషన్ గురించిన వార్త ఇప్పుడు ఫిలిం వర్గాల్లో హల్చల్ చేస్తోంది. ప్రభాస్ సరసన నటించేందుకు పడుకోణె ఏకంగా 20 కోట్లు తీసుకుంటుందట. ఇంత భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇప్పటివరకు మన దేశం లోనే ఏ హీరోయిన్ కు ఎవరు ఇవ్వలేదని అంటున్నారు.

Related posts