telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శివకార్తికేయన్ “హీరో” టీజర్

Hero

తమిళ యంగ్ హీరో శివకార్తికేయన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన హీరో సినిమాతో బిజీగా ఉండగా… త్వ‌ర‌లో విఘ్నేష్‌శివ‌న్‌, ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్నాడు. ఇక శివ‌కార్తికేయ‌న్ న‌టిస్తున్న తాజా చిత్రం “హీరో”. ఇరుంబు తిరై ఫేమ్ పిఎస్ మిత్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీని కేజీఎన్ స్టూడియోస్ నిర్మిస్తుంది. అర్జున్ స‌ర్జా, అభయ్ డియోల్‌, ఇవానా ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ ఈ సినిమాతో హీరోయిన్ గా త‌మిళ సినిమా పరిశ్ర‌మ‌కి ప‌రిచ‌యం అవుతుంది. తాజాగా చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు. టీజర్ చూస్తుంటే విద్య‌కి సంబంధించిన ఆస‌క్తిక‌ర క‌థాంశంతో చిత్రం తెర‌కెక్కిన‌ట్టు తెలుస్తుంది. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందిస్తున్నారు. మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.

Related posts