ఏపీ సీఎం వైఎస్ జగన్ మంత్రివర్గ విస్తరణపై దృష్టి పెట్టారు. మంత్రివర్గం ఎలా ఉండాలి? ఎవరికి స్థానం కల్పించాలి? అనే అంశాలపై జగన్ వైసీపీ ముఖ్యనేతలతో చర్చించారు. ఈ సమావేశంలో నూతన క్యాబినెట్ పదవీప్రమాణస్వీకారానికి తగిన ముహూర్తం గురించి కూడా చర్చ జరిగింది. గత కొంత కాలంగా వైఎస్ జగన్ ఏ పని చేసినా అన్ని అనుకూలతలను బట్టి కార్యాలను నిర్వహిస్తున్నారు. అలాగే దైవ బలాన్ని కూడా బాగా నమ్ముతున్న విషయం తెలిసిందే.
ఈ మేరకు కొత్త క్యాబినెట్ కొలువుదీరేందుకు జూన్ 8 ముహూర్తంగా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఆ రోజున మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. తన మంత్రివర్గంలో ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలకు కూడా అవకాశం ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. క్యాబినెట్ ఏర్పాటు పూర్తయ్యాక జూన్ 15న గానీ, లేక ఆ తర్వాత గానీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు.
అమరావతికి మూడు వేల కోట్ల బ్యాంకు గ్యారెంటీ : బొత్స