telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“హే పీకే ఫ్యాన్స్… ఆ రోజు గుర్తుంది కదా…” మళ్ళీ కెలికిన వర్మ

Power-Sttar

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘పవర్ స్టార్’ అంటూ సెటైరికల్ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. దీంతో పవన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘‘దమ్ముంటే వచ్చి నాపై దాడి చేయమనండి. నా ఆఫీస్ అడ్రస్ గూగుల్‌లో కొడితే వస్తుంది. ఎమ్మెల్యే కాలనీలో నా కంపెనీ ఉంది’’ అంటూ వర్మ బహిరంగ సవాల్ విసరడం, దీనిపై రియాక్ట్ అయిన పవన్ ఫ్యాన్స్ వచ్చి వర్మ ఆఫీసు అద్దాలు పగలగొట్టి నానా హంగామా చేయడం.. ఆ వెంటనే పోలీస్ కేసు, రామ్ గోపాల్ వర్మ తన ఫిర్యాదును వెనక్కి తీసుకోవడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో వర్మ Vs పవన్ ఫ్యాన్స్‌‌ ఇష్యూ జనాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ మొత్తం ఉదంతాన్ని రామ్ గోపాల్ వర్మ.. తనదైన కోణంలో పబ్లిసిటీ స్టంట్‌గా వాడేస్తున్నారనే వాదనలు జనాల్లో మొదలయ్యాయి. అంతా అలా అనుకుంటుండగానే వర్మ “హే పీకే ఫ్యాన్స్! ఆ రోజు (జులై 25) గుర్తుంది కదా! మర్చిపోకండి” అంటూ మరో సెటైరికల్ పోస్టర్ వదిలారు ఆర్జీవీ. అంతటితో ఆగక మీ దాడి వల్లనే నా ‘పవర్ స్టార్’ ట్రైలర్ 30 లక్షల వ్యూస్ రాబట్టిందని, చాలా థాంక్స్ అంటూ పుండు మీద కారం చల్లారు. ఈ ట్వీట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Related posts