ఆర్ఆర్ఆర్… ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్‌టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అదేవిధంగా బాలీవుడ్ నటులు అజయ్ దేవగన్, అలియా భట్ మరికొందరు కొన్ని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికీ ఈ సినిమాలోని ప్రధాన పాత్రలను ఉద్దేశించి విడుదల చేసిన రెండు ట్రైలర్లు కూడా భారీగా ప్రజాదరణ పొందాయి. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందే చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ చిన్న ఇంగ్లీషు పాట కూడా ఉండనుందట. ఈ పాట ఎన్‌టీఆర్‌పై ఆసక్తిగా ఉన్న ఒలీవియా మొర్రిస్ పాత్రకు ఉందనుదని వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో ప్రస్తుతం ఈ వార్తలు నెట్టింట వైరల్ అవుతుంది. అయితే ఈ పాట ద్వారా అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకులను ఆకర్షించేందుకే జక్కన్న ప్లాన్ చేస్తున్నాడాని అంటున్నారు. హాలీవుడ్ రేంజ్‌లో కూడా భారీ వసూళ్లను రాబట్టేందుకే రాజమౌలి ఈ ప్లాన్ చేశాడట. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
previous post
next post
సౌత్‌లో హీరోలను చూడటానికే థియేటర్స్‌కు వస్తారు : రకుల్ ప్రీత్ సింగ్