telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వాలైంటైన్స్ డేను టార్గెట్ చేసిన స్టార్ హీరోలు

Tollywood

వాలెంటైన్స్ డే… సినీ ప్రేమికుల కోసం తమ కొత్త సినిమాల అప్ డేట్లతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైపోతున్నారు హీరోలు. ఇప్పటికే రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన సినిమా “వరల్డ్ ఫేమస్ లవర్”తో తన అభిమానులకు ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. మరోవైపు తమిళ హీరో విజయ్, సాయి ధరమ్ తేజ్, నాగ చైతన్య, సందీప్ కిషన్ వంటి హీరోలు సైతం వాలైంటైన్స్ డే రోజున తమ సినిమాల అప్డేట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వివరాల్లోకి వెళ్తే… దళపతి విజయ్, ‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో నటిస్తున్న ‘మాస్టర్’ మూవీలోని ‘ఒరు కుట్టి కథ’ అనే ఫస్ట్ లిరికల్ సాంగ్ ఫిబ్రవరి 14 సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకి సంగీతమందిస్తున్నాడు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. మాళవిక మోహనన్, ఆండ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా సెన్సిుబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రేమకథా చిత్రం.. ‘లవ్ స్టోరీ’.. ప్రేమికుల దినోత్సవం సదర్భంగా ఈ చిత్రంలోని ‘ఏయ్ పిల్లా’ అనే తొలి గీతాన్ని ఫిబ్రవరి 14 ఉదయం 11:07 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. పవన్ ఈ సినిమాకి సంగీతమందిస్తున్నారు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ అంటున్న సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కూడా వాలెంటైన్స్ డే నాడు సింగిల్స్‌కి సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. నభా నటేష్ కథానాయికగా నటిస్తున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ థీమ్ వీడియో ఫిబ్రవరి 13 సాయంత్రం 5 గంటలకు రిలీజ్ కానుంది. థమన్ మ్యూజిక్ అందిస్తుండగా సుబ్బుని దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్ హీరో సందీప్ కిషన్, సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి కలిసి నటిస్తున్న స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ.. ‘A 1 Express’.. డెన్నిస్ జీవన్ కనుకొలను డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా హాకీ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఫిబ్రవరి 12 సాయంత్రం 5 గంటలకు రాహుల్ సిప్లిగంజ్ పాడిన ‘సింగిల్ కింగులం’ అనే గీతాన్ని విడుదల చేయనున్నట్టు తెలిపారు నిర్మాతలు.. హిప్ హామ్ తమిళ సంగీతమందిస్తున్నాడు.

Related posts