telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నందిని రెడ్డి దర్శకత్వంలో మెగా హీరో

vaishnav

మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ అరంగేట్రం చేయబోతున్న మరో హీరో పంజా వైష్ణవ్‌తేజ్. సాయి ధరమ్ తేజ్ తమ్ముడైన వైష్ణవ్ ప్రస్తుతం ‘ఉప్పెన’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడు. సినిమాను ప్రముఖ దర్శకుడు సుకుమార్, సుకుమార్ రైటింగ్స్‌ బ్యానర్‌పై మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మిస్తున్నాడు. తమిళ స్టార్ హీరో విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో నెగెటివ్ రోల్‌లో నటిస్తుండగా దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు.ఈ సినిమా విడుదల కాకముందే వైష్ణవ్‌కు మరో అవకాశం వచ్చినట్టు సమాచారం. చక్కని హాస్యంతో అందమైన ప్రేమకథలను రూపొందించే డైరెక్టర్ నందినీ రెడ్డి.. వైష్ణవ్ రెండో సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారట. ‘ఓ బేబీ’తో విజయం అందుకున్న నందిని తర్వాతి సినిమా ఇదేనని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను అశ్వినీదత్ కుమార్తెలు స్వప్నాదత్, ప్రియాంకాదత్ నిర్మిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు పనులతో నందిని బిజీగా ఉన్నారట. మరి నిజమెంత ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఎదురు చూడాల్సిందే.

Related posts