telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

నేడు సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్…

Modi Mask

క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి సిద్ధ‌మైంది భార‌త ప్ర‌భుత్వం… ఇప్ప‌టికే భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కోవాక్సిన్, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ రూపొందించిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌లకు డీసీజీఐ అత్యవసర అనుమతి ఇచ్చింది.. ఇక‌, ఈ నెల 16వ తేదీ నుంచి దేశ‌వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం కానుంది… అయితే. వ్యాక్సినేష‌న్‌పై ఇవాళ కీల‌క స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కీల‌క భేటీ నిర్వ‌హించ‌నున్నారు భార‌త ప్ర‌ధాని. వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లపై చ‌ర్చించ‌నున్నారు.. కాగా, 16వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుకానుండ‌గా.. తొలిదశలో 30 కోట్ల మందికి కరోనా టీకా పంపిణీ చేయాలని నిర్ణయించింది కేంద్రప్రభుత్వం. కొవిడ్ వారియర్స్, ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులకు తొలి దశలో టీకా ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.  డ్రై రన్‌ విజయవంతమైన నేపథ్యంలో “కరోనా” వ్యాక్సిన్‌ పంపిణీ ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రాలలో వ్యాక్సిన్‌ పంపిణీకి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో ఆచరణ క్రమంలో ఉన్న ఇబ్బందులపై మాట్లాడనున్నారు.

Related posts