telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

డిగ్రీ పూర్తికాగానే .. ఉద్యోగం ఇచ్చెయ్యాల.. ఏంచేస్తారో మీ ఇష్టం.. : ఏపీసీఎం

సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి నేడు ప్రభుత్వ బడులను బాగుచేయడాన్ని సవాల్‌గా తీసుకున్నామని.. ఏ దశలోనూ డ్రాపౌట్స్‌ ఉండకూడదని అన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ నిపుణుల కమిటీతో సీఎం సమావేశమయ్యారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌తో పాటు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. విద్యా ప్రమాణాల పెంపుతో పాటు విద్యాశాఖలో అమలు చేయాలనుకుంటున్న నూతన విధానాలపై సీఎం వారితో చర్చించారు. విద్యారంగంలో మార్పులపై కమిటీకి తన అభిప్రాయాలు చెప్పారు.

ప్రతి విద్యార్థికీ మూడు జతల దుస్తులు అందజేస్తామని.. విద్యార్థులు షూలు, సాక్సులు కొనేందుకు డబ్బులు కూడా ఇస్తామని జగన్‌ చెప్పారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పట్టణ ప్రాంతాల్లో అక్షయపాత్ర సంస్థకు, గ్రామీణ ప్రాంతాల్లో డ్వాక్రా మహిళలకు అప్పగిస్తామని అన్నారు. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ఫీజుల నియంత్రణకు పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు. బోర్డింగ్‌, లాడ్జింగ్‌ కోసం ప్రతి విద్యార్థికీ ఏటా రూ.20వేలు ఇస్తామన్నారు. డిగ్రీ పట్టా తీసుకున్నాక ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉండాలని.. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇస్తామని చెప్పారు.

Related posts