telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ సినిమా వార్తలు

నటి ఇంట్లో 111 గ్రాముల బంగారం చోరీకి పాల్పడ్డ నర్సు… అరెస్ట్!

Gold rates hike

తమిళ నటి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డ నర్సును పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే… చెన్నై రాయపేటలోని లాయిడ్స్ రోడ్డు వీధిలో కోలీవుడ్ నటి గాయత్రి సాయినాథ్ తన తల్లితో కలిసి నివసిస్తున్నారు. వృద్ధురాలైన తన తల్లికి సపర్యలు చేసేందుకు మైలాపూర్ కబాలితోటకు చెందిన శివకామి అనే నర్సును నియమించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల నటి ఇంట్లో 111 గ్రాముల బంగారం మాయమైంది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా… చోరీకి పాల్పడింది నటి ఇంట్లోని నర్సు శివకామియేనని నిర్ధారణ అయ్యింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా… దొంగిలించిన బంగారాన్ని శివకామి తాకట్టు పెట్టినట్టువిచారణలో తేలింది. దీంతో పోలీసులు బంగారాన్ని స్వాధీనం చేసుకుని గాయత్రికి అందజేశారు.

Related posts