telugu navyamedia
సినిమా వార్తలు

రకుల్ ఘాటు ఫోజు… వివాదాస్పదం

Rakul

తెలుగులో అగ్ర క‌థానాయిక‌గా వెలుగొందిన ర‌కుల్ ప్రీత్ సింగ్‌కు ప్ర‌స్తుతం తెలుగులో అవ‌కాశాలు త‌గ్గాయి. కానీ ఈ భామ తమిళంలో మాత్రం వరుస సినిమాలు చేస్తోంది. తెలుగులో సీనియ‌ర్ హీరోలతో న‌టించేందుకూ సై అంటోంది. ఇటీవల బాలీవుడ్ లో ఆమె నటించిన చిత్రం హిట్ కావడంతో బాలీవుడ్‌లోనూ అవ‌కాశాల కోసం ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ నేప‌థ్యంలో త‌న‌లో గ్లామ‌ర్ కోణాన్ని ఆవిష్కరిస్తూ హాట్‌హాట్ ఫోటోషూట్ల‌లో పాల్గొని ఆ ఫోటోల‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తోంది. తాజాగా ర‌కుల్ పోస్ట్ చేసిన ఓ ఫోటో సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఫ్యాంట్‌కు జిప్ వేసుకోకుండా ర‌కుల్ దిగిన ఓ ఫోటోపై నెటిజ‌న్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఫ్యాష‌న్ పేరిట మ‌రీ ఇంత దిగ‌జారిపోవాలా అంటూ విమ‌ర్శలు కురిపిస్తున్నారు.

Related posts