telugu navyamedia
సినిమా వార్తలు

పెళ్ళిపై క్లారిటీ ఇచ్చిన శింబు

Simbu

తమిళ నటుడు శింబు త్వరలో తన బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోనున్నాడని సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. అలాగే ఆయన నటిస్తున్న చిత్రాల గురించిన వదంతులు కూడా విన్పిస్తున్నాయి. దీనికి సంబంధించి శింబు ఓ ప్రకటనను విడుదల చేశారు. అందులో “నా వివాహం గురించి కొన్ని వార్తలు నాకు వినిపించాయి. నేను చాలా క్లియర్‌గా చెబుతున్నాను నాకు అలాంటి ఉద్దేశం ప్రస్తుతానికి లేదు. అందుకు సంబంధించిన నిర్ణయం ఏదైనా వుంటే తగిన సమయంలో, తగిన రీతిలో ప్రకటిస్తాను. సినిమాకు సంబంధించి కొన్ని చిత్రాల్లో నేను నటిస్తున్నట్టు, పలానా దర్శకుడిని, నిర్మాతను కలిశానని కూడా వదంతులు వ్యాపిస్తున్నాయి. ఒక నటుడిగా పలువురు దర్శక, నిర్మాతలను కలుస్తుంటాం, అంత మాత్రాన అవకాశాల కోసం వారిని కలిశామని చెప్పడం భావ్యమేనా’… అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి తప్పుడు పుకార్ల వల్ల అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అలాగే సినీపరిశ్రమలోని ఇతరులకు తప్పుడు సమాచారం చేరడం వల్ల నా కెరీర్‌కు కొంత నష్టం జరుగుతుంది” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts