telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“అల వైకుంఠపురంలో” టీజర్… మీ నాన్న పెళ్లి కూతురిని దాచినట్లు దాచాడు…!

Ay

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘అల వైకుంఠపురములో…’ వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో సుశాంత్, నివేదా పెతురాజ్‌, ట‌బు, జయరామ్, సముద్రఖని కీలక పాత్ర‌ల‌లో నటిస్తున్నారు. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుంది. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్‌లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోందని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఇటీవలే విడుదల చేసిన ‘సామజవరగమన’, ‘రాములో రాముల’, ‘ఓ డాడీ’ పాటలు చిత్రంపై అంచనాల్ని తారాస్థాయికి చేర్చాయి. ఈ పాటలు ఎంతటి సంచలనం సృష్టించాయో తెలిసిందే. తాజాగా ఈ మూవీ టీజర్ ను నేడు విడుదల చేశారు. “మీ నాన్న పెళ్లి కూతురిని దాచినట్లు దాచాడు నిన్ను..సరిగా చూడలేదెపుడు ముందుకు రా” అంటూ సాగే సంభాషణలతో షురూ అయ్యే ట్రైలర్ కొత్తగా ఉంది. “అల‌..వైకుంఠ‌పుర‌ము”లో మ‌ల‌యాళ‌ంలో కూడా సందడి చేయనుంది. మీరు కూడా ఈ చిత్రం ట్రైలర్ ను వీక్షించండి.

Related posts