telugu navyamedia
సినిమా వార్తలు

అల్లు అర్జున్ “సైరా” ఈవెంట్ కు రాకపోవడానికి కారణం ఇదే…?

Syeraa

తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో ఆయన నటించిన చిత్రం “సైరా నరసింహారెడ్డి”. సురేందర్‌రెడ్డి దర్శకుడు. అమిత్‌ త్రివేది స్వరకర్త. శ్రీమతి సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మించారు. ఆదివారం హైదరాబాద్‌లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. చిరంజీవి తన 41 ఏళ్ళ కెరీర్‌లో ఒక హిస్టారికల్ క్యారెక్టర్ చేయడం ఇదే మొదటిసారి. అంతేకాదు చిరంజీవి నటించిన ఈ సినిమా ఒకేసారి తెలుగుతో పాటు హిందీ, తమిళం,కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కావడం అనేది కూడా ఫస్ట్ టైమే అని చెప్పొచ్చు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ‘U/A’ సర్టిఫికేట్ ను పొందింది. ఈ సినిమా అక్టోబర్ 2న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకానున్న విషయం తెలిసిందే. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, సాయి ధరం తేజ్, వరుణ్ తేజ్ ఇలా మెగాహీరోలు హాజరయ్యారు. కానీ అక్కడ అల్లు అర్జున్ మాత్రం కనిపించలేదు. ఈ విషయం పలు అనుమానాలకు దారి తీసింది. సమాచారం ప్రకారం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరుగుతుందనే విషయం బయటకి అనౌన్స్ చేసినప్పటి నుండి గెస్ట్ లుగా పవన్ కళ్యాణ్ పేరు బాగా వినిపించింది. బన్నీని రమ్మని మాట వరుసకైనా కూడా నిర్మాత హోదాలో ఉన్న రామ్ చరణ్ చెప్పలేదని, దీంతో తను మాత్రం ఎందుకు వెళ్లాలని బన్నీ ఫీలైనట్లు సమాచారం. అందుకే సినిమా ట్రైలర్ పై సోషల్ మీడియాలో కామెంట్ చేయకుండా, ఫంక్షన్ కి కూడా కాలేకపోయాడని అంటున్నారు.

Related posts