telugu navyamedia
సినిమా వార్తలు

మిల్కీ బ్యూటీ హీరోయిన్ గా “రాజుగారి గది-3” ప్రారంభం

Tamannah

ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హార‌ర్ కామెడీ చిత్రం “రాజుగారిగ‌ది” చిన్న చిత్రంగా తెరకెక్కి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ తరువాత ఈ సినిమాకు సీక్వెల్ గా “రాజుగారి గది-2” చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో నాగార్జున, సమంత కీలకపాత్రల్లో నటించారు. అయితే “రాజుగారిగది” ఆకట్టుకున్నంతగా “రాజుగారి గది-2” ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఆ సినిమాకు ఫ్రాంచైజీగా “రాజుగారి గ‌ది-3” తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. గురువారం రూజ్ పూజా కార్యక్రమాలతో సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా నిర్మిత‌మ‌వుతుంది. సినిమా ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి దిల్‌రాజు ముఖ్య అతిథిగా హాజ‌రై ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ కొట్టారు. స్టార్ మా బిజినెస్ హెడ్ అలోక్ జైన్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. శుక్ర‌వారం నుండి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ హైద‌రాబాద్‌లో ప్రారంభం అవుతుంది. “రాజుగారిగ‌ది-3″లో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా భాటియా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తుండ‌గా అశ్విన్ కీలక పాత్ర‌లో న‌టిస్తున్నారు. అలీ, బ్ర‌హ్మాజీ, ప్ర‌భాస్ శ్రీను, హ‌రితేజ‌, ఊర్వ‌శి, అజ‌య్‌ఘోష్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఛోటా కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

Related posts