telugu navyamedia
సినిమా వార్తలు

టక్‌ జగదీష్‌ వచ్చేస్తున్నాడు..సెలబ్రేషన్స్ షురూ

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన కుటుంబ కథా చిత్రం ‘టక్‌ జగదీష్‌’. ఎన్నో సందిగ్ధతల నడుమ ఎట్టకేలకు ‘టక్‌ జగదీష్‌’ రిలీజ్‌ డేట్‌ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. గత కొన్నాళ్ల నుంచి ఈ సినిమా విడుదల విషయంపై చర్చ జరుగుతూనే ఉంది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ‘నిన్నుకోరి’ తర్వాత శివ నిర్వాణ-నాని కాంబినేషన్‌లో వస్తోన్న రెండో చిత్రమిది.

Nani's Tuck Jagadish gets OTT release date | Entertainment News,The Indian Express

“టక్ జగదీష్” గురించి ఏప్రిల్ నుండి విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. సస్పెన్స్ కు తెర దించుతూ ..వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్‌ 10న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ‘టక్‌ జగదీష్‌’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tuck Jagadish Movie - Trailer, Star Cast, Release Date | Paytm.com

ఈ విషయాన్ని తెలియజేస్తూ నాని ఓ స్పెషల్‌ వీడియోని నెటిజన్లతో పంచుకున్నాడు. ‘భూదేవిపురం చిన్నకొడుకు నాయుడిగారి అబ్బాయి టక్‌ జగదీష్‌ చెబుతున్నాడు మొదలెట్టండి’ అంటూ సినిమాలో నాని చెప్పిన డైలాగ్‌తో ఉన్న ఈ వీడియో సినీ ప్రియుల్ని ఎంత‌గానో ఆకట్టుకుంటోంది. దీంతో ఆయన అభిమానులు సెలబ్రేషన్స్ షురూ చేశారు.

Date locked for Tuck Jagadish Digital Release | Manacinema

ఈ చిత్రాన్ని ముందుగా ఏప్రిల్ 23న థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అయితే లాక్‌డౌన్ కారణంగా మిగతా సినిమాల్లాగే ఈ సినిమా కూడా విడుదలను వాయిదా వేసుకుంది. అప్పటి నుంచి ఈ సినిమా ఒకసారి ఓటిటిలో విడుదలవుతుంది అంటే కాదు థియేటర్లలోనే విడుదల అవుతుంది అంటూ వార్తలు వచ్చాయి.

Nani's Tuck Jagadish to release on Amazon Prime Video on Sep 10. Watch promo - Movies News

ఎట్టకేలకు ఈ సినిమా ఓటిటిలోనే ఉంటుందని కన్ఫర్మ్ కావడంతో డిస్ట్రిబ్యూటర్లు ఫైర్ అయ్యారు. అనంతరం కూల్ అయిన వాళ్ళు నానికి సారీ చెప్పారు. రీసెంట్ గా “టక్ జగదీష్”ను ఎందుకు ఓటిటిలో విడుదల చేయాలనీ అనుకున్నారో, దానికోసం ఎంత తర్జనభర్జన పడ్డారో తెలుపుతూ ఓ సుదీర్ఘ లెటర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నిర్మాతలు. ఎట్టకేలకు ఈ రోజు సినిమా ఓటిటిలోనే విడుదలవుతుందని ప్రకటించారు.

Nani, Aishwarya Rajesh and Ritu Varma's Tuck Jagadish to release on OTT | The News Minute

కాగా..గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నానికి జోడీగా రీతూవర్మ, ఐశ్వర్య రాజేశ్‌ సందడి చేయనున్నారు. నాజర్‌, జగపతిబాబు, నరేశ్‌, రావురమేశ్‌, రోహిణి కీలకపాత్రల్లో కనిపించనున్నారు. తమన్‌ స్వరాలు అందించారు. షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు.

Related posts