telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘ఆచార్య’లో మహేష్ పేరు ఎందుకు వచ్చిందంటే… క్లారిటీ ఇచ్చిన కొరటాల

koratala

దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా `ఆచార్య` సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ కనిపించనున్నాడు. ఈ సినిమాలో చిరు, చరణ్ ఇద్దరు గురు, శిష్యుల పాత్రల్లో నటించబోతున్నారు. చరణ్‌కు జోడీగా ఓ హీరోయిన్ కూడా ఉండబోతున్నట్లు కొరటాల తెలిపారు. అయితే `ఆర్ఆర్ఆర్` వల్ల చెర్రీ బిజీగా ఉండడంతో అతని స్థానంలో సూపర్‌స్టార్ మహేష్‌ నటిస్తాడని ప్రచారం జరిగింది. తాజాగా ఆ వార్తల గురించి దర్శకుడు కొరటాల శివ స్పందించారు. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ అయ్యే వరకు ‘ఆచార్య’ రాకపోవచ్చంటూ కొని వార్తలు రావడంతో వాటిని చూసి తాను భయపడ్డానని కొరటాల చెప్పారు. ఇక మహేష్‌తో ఉన్న సాన్నిహిత్యం వలన మామూలుగా ఒకసారి ఫోన్ చేసినప్పుడు ఆచార్య గురించి మాట్లాడుకున్నామని ఆ సమయంలో పరిస్థితిని ఆయనకు వివరించినట్లు వెల్లడించారు.దానికి మహేష్ స్పందిస్తూ టెన్షన్ ఎందుకు `మరీ అవసరమైతే నేను ఉన్నాను` అని అన్నారు. మహేష్ ఆ మాట అనడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. సినిమాలో పాత్ర గురించి కూడా తెలియకుండా `నేనున్నా` అని మహేష్ చెప్పారు. ఆయనది గొప్ప మనసు` అని కొరటాల చెప్పారు. కాగా సామాజిక కథాంశం నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రంతో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Related posts