బాలీవుడ్ భామ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లెటేస్ట్ మూవీ తలైవి . తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ లో నటిస్తుంది. ఈ సినిమాలో ఫైర్ బ్రాండ్ అచ్చం జయలలిత మాధిరిగానే కనిపిస్తోంది. అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక తాజాగా ఈ సినిమాను సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. టీజర్ ట్రైలర్ లోనూ కంగనా రనౌత్ జయలలిత లుక్ లో అదరగొట్టింది.
ఇక తాజాగా మరోసారి కంగనా రనౌత్ జయలలిత గెటప్ లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఈ సినిమా విజయం సాధించాలని జయలలిత గెటప్ లో చెన్నై లోని మెరీనా బీచ్ లో ఉన్న జయలలిత సమాధి వద్దకు వెళ్లి కంగనా రనౌత్ నివాళ్లర్పించారు. ఇక ప్రస్తుతం జయలలిత గెటప్ లో నారింజ -ఎరుపు రంగు చీరతో కంగనా కనిపించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ ఫోటోలకు సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
అంతేకాకుండా ..తలైవి చిత్రాన్ని తమిళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. అలాగే థియేటర్లతోపాటు.. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నారు మేకర్స్. ఈ మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థలు నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైంలో విడుదల చేయనున్నారని.. ఇందుకోసం రూ. 55 కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై నాగబాబు వ్యాఖ్యలు