telugu navyamedia
సినిమా వార్తలు

నా బుద్ది గడ్డి తిని అలా తిట్టాను… నన్ను క్షమించండి..

టాలీవుడ్‌లో కాస్టింగ్‌ కౌచ్ ఇష్యూలో శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శనతో అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఇష్యూలో పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు నచ్చక శ్రీరెడ్డి.. పవన్ కళ్యాణ్ తల్లిని తీవ్ర పదజాలంతో దూషించింది.

అయితే గతంలో చిరంజీవి తల్లిని దూషిస్తూ తాను చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. బుద్ది గడ్డి తిని తాను చేసిన తప్పును పెద్ద మనసు చేసుకొని క్షమించాలని కోరింది. ఈ మేరకు ట్విట్టర్‌లో వీడియో రిలీజ్‌ చేసింది.

Megastar Chiranjeevi posts a heart touching tweet to his mother

‘ఆడవాళ్ల కోసం చేసే ఉద్యమానికి న్యాయం జరగాలంటే.. ఒక ఆడదాన్ని తిడితే న్యాయం కోసం ఒక పెద్ద మనిషి నా బ్రెయిన్ వాష్ చేసి అతని పంతం కోసం నన్ను ఉపయోగించుకున్నాడు. అతనికి చిరంజీవికి ఎలాంటి తగాదాలు ఉన్నాయో నాకు తెలియదు కానీ.. చిరంజీవి కుటుంబం క‌దిలి రావ‌ల‌ని ఈ పెద్ద మనిషి ఇచ్చిన సలహాతో ఏ సంబంధం లేని, అమాయకురాలైన త‌ల్లిని తిట్టారు.

దానికి నేను శిక్ష కూడా అనుభవించాను.. సోషల్‌ మీడియాలో కూడా చాలా ట్రోల్స్‌ ఎదుర్కొన్నా. పర్సనల్‌గా నాకు ఫోన్లు చేసి బెదిరించారు. మా సొంతవాళ్లు కూడా అలా అనడం తప్పు అని చెప్పారు. ఆ విషయంలో నేను ఇప్పటికీ బాధపడుతున్నాను.

అందుకే అమ్మవారి శక్తి ముందు నేను చెప్తున్నా.. ఒక ఆడదాన్ని అన్యాయంగా తిట్టడం తప్పే. దానికి నేను ఒప్పుకుంటున్నా.. నేను తప్పు చేశాను.. పెద్ద మనసు చేసుకుని ఆ పెద్దమ్మ తల్లి ఎలాగైతే క్షమిస్తుందో నన్ను కూడా క్షమించండి.

ఇండస్ట్రీలో చిరంజీవి అనేవారు ఒక పెద్ద హీరో.. వాళ్ల అమ్మగారిని నేను తిట్టాల్సింది కాదు..బుద్ది గడ్డి తిని అలా తిట్టాను. నా జీవితంలో నేను తప్పు చేసినప్పుడు క్షమాపణ కోరడానికి సిగ్గుపడను. ఎందుకంటే ఆ పాపాన్ని మోయడం నాకు ఇష్టం ఉండదు. అందుకే అంజనా దేవి గారూ అంటూ పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించండి’ అంటూ శ్రీరెడ్డి పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.

Related posts