telugu navyamedia
సినిమా వార్తలు

45 సంవత్సరాల “లాయర్ విశ్వనాథ్”

టరత్న ఎన్.టి.రామారావు గారు నటించిన రవిచిత్ర ఫిల్మ్ స్ వారి “లాయర్ విశ్వనాథ్” చిత్రం 17-11-1978 న విడుదలయ్యింది.

నిర్మాత వై.వి.రావు హిందీలో విజయవంతమైన “విశ్వనాథ్” చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తూ రవిచిత్ర ఫిలింస్ పతాకంపై ప్రముఖ దర్మకుడు ఎస్.డి.లాల్ దర్శకత్వంలో ఈచిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రానికి మాటలు: గొల్లపూడి, పాటలు: వేటూరి, సి.నారాయణ రెడ్డి, సంగీతం: సత్యం, పొటోగ్రఫీ: పి.దేవరాజ్, కళ: బి.చలం, నృత్యం: బి.హీరాలాల్, కూర్పు: డి.రాజగోపాల్ అందించారు.

ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు, జయసుధ, కవిత, సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, శరత్ బాబు, అల్లు రామలింగయ్య, కాంతారావు, ధూళిపాళ, రాజనాల, ముక్కామల ,రమణ మూర్తి, రంగనాథ్, శ్రీలంక మనోహర్, సాక్షి రంగారావు, కె.వి.చలం, పండరీ బాయి, త్యాగరాజు, మాడా, పుష్ప కుమారి తదితరులు నటించారు.

ప్రముఖ సంగీత దర్శకుడు సత్యం గారి సంగీత సారధ్యంలో
“పిలిచె పిలిచె అనురాగం పలికె పలికె నవగీతం”
“కలకాలం వుండవులే కన్నీళ్ళు
కలలైనా కలతలైనా కొన్నాళ్ళు”
“రాముడెప్పుడు రాముడే రఘరాముడెప్పుడూ”
వంటి సూపర్ హిట్ సాంగ్స్ శ్రోతలను అలరించాయి.
ఈ చిత్రం పలుకేంద్రాల్లో 50 రోజులు, రెండు కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శింపబడి శతదినోత్సవం జరుపుకున్నది…..

Related posts