telugu navyamedia
సినిమా వార్తలు

“ప్రధాని నరేంద్ర మోడీ మీదనే పోరాటం చేసిన ప్రకాష్ రాజ్ “మా”.. లో .. ఇలా ..?” -శివాజీ

ప్రకాష్ రాజ్ భారతీయుడు. మన అందరం గర్వించతగ్గ గొప్ప నటుడు. తాను నమ్మిన సిద్ధాంతాలను పాటించే వ్యక్తి . అలాంటి ప్రకాష్ రాజ్ “మా “లాంటి చిన్న సంస్థకు వచ్చి సేవ చేస్తానని అంటే .. ప్రాంతీయ తత్వంతో అతన్ని ఓడించారు. మన అనే భావంతో విష్ణును గెలిపించారు. ఎన్నికల్లో ఇలాంటి సంకుచిత భావాలు నాకు నచ్చవు. సినిమా అనేది చాలా శక్తివంతమైన మీడియా. గ్లామర్ ప్రపంచం.

అందుకే “మా ” ఎన్నికలకు ఇంత హైప్ వచ్చింది. మీడియా ఈ ఎన్నికలను బ్రహ్మాండంగా ఉపయోగించుకుంది. ఇవ్వన్నీ చుసిన తరువాత నేను రాజకీయాలకు దూరంగా ఉందామని అనుకుంటున్నా. వచ్చే ఎన్నికల వరకు నేను రాజకీయాలు మాట్లాడను , టీవీ చర్చలకు రాను. ప్రస్తుతము నాకు సినిమాలు లేవు , అందుకే టీవీల్లో కనిపిస్తున్నాడు అనుకుంటున్నారు.

అది నిజం కాదు . నేను ప్రస్తుతం రెండు సినిమాలు ఒప్పుకున్నా. అందులో బయోపిక్ ఒకటి. వీటి వివరాలు తరువాత తెలియజేస్తా.
2023 ఎన్నికల్లో నేను పోటీ చేస్తా. ఏదైనా పార్టీ తరపునా ? స్వతంత్రంగానా ” అన్నది తరువాత చెబుతా. . అలాగే శాసనసభాకా ? పార్లమెంటుకా ? అనేది అప్పుడు నిర్ణయించుకుంటా అన్నారు.

 

Related posts