telugu navyamedia
ఆంధ్ర వార్తలు

“మా ” ఎన్నికల్లో జగన్ నినాదం..

ఆదివారం రోజు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాల ప్రకటన తరువాత పలు ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకున్నాయి. ప్రకాష్ రాజ్ పై మంచు విజయం సాధించారనే వార్త విన్న మోహన్ బాబు అభిమానులు “జై జగన్ ” అనే నినాదాలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Vishnu Manchu on Twitter: "One man with courage makes a majority. God speed Jagan Anna. @ysjagan… "

జూబిలీహిల్స్ స్కూల్ లో “మా ” ఎన్నికలు ఉదయం ఎనిమిదిగంటలకు ప్రారంభమై మూడు గంటలకు ముగిచాయి. ఈసారి ఎప్పుడు లేనంత మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 923 మంది “మా” లో సభ్యులుగా వున్నారు . వీరిలో 883 మందికి ఓటు హక్కు వుంది. నిన్న జరిగిన పోలింగులో 603 మంది ప్రత్యక్షంగా పోలింగు కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. 52 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 665 ఓట్లు పోలయ్యాయి.

ఓట్ల లెక్కింపు రాత్రి 10. 45 వరకు కొనసాగింది . అయితే అప్పటికే సమయం మించిపోవడంతో కొన్ని పోస్టుల ఓట్ల లెక్కింపు సోమవారం జరుగుతుందని ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ ప్రకటించారు . నిజానికి “మా”లో అన్ని పోస్టులకు లెక్కింపు జరిగిన తరువాత అధ్యక్షుడు లెక్కింపు ఉంటుందని తొలుత ప్రకటించారు.

MAA elections 2021 results: 'Insider' Vishnu Manchu defeats 'outsider' Prakash Raj | Entertainment News,The Indian Express

అయితే అనూహ్యంగా అధ్యక్షుడు ఓట్ల లెక్కింపు జరిగింది. మంచు విష్ణు ప్రకాష్ రాజ్ పై గెలుపొందారని ఎన్నికల అధికారి ప్రకటించగానే బయట వున్న విష్ణు, మోహన్ బాబు అభిమానులు సంతోషంతో కేకలు వేస్తూ “జగన్ జిందాబాద్ ” , , జై జగన్ ” అనే నినాదాలు మారు మ్రోగాయి .

ఈ ఎన్నికలకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధం లేదని మంత్రి పేర్ని నాని ప్రకటించినా , ఫలితాలు రాగానే జగన్ నినాదం రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది . .

Related posts