telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

కొత్త టెన్షన్… పులికి కరోనా…!?

Tiger

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మొట్టమొదటిసారి ఓ పులికి సోకడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరంలోని బ్రోంక్స్ జంతు ప్రదర్శనశాలకు చెందిన నాడియా అనే నాలుగేళ్ల వయసుగల పులికి కరోనా వైరస్ సోకిందని అమెరికా ఫెడరల్ అధికారులు ప్రకటించారు. జూపార్కు ఉద్యోగి నుంచి పులికి కరోనా వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నారు. బ్రోంక్స్ జూపార్కులో నాడియాతోపాటు మరో ఆరు పులులు, సింహాలు అనారోగ్యానికి గురయ్యాయి. దీంతో పరీక్షలు చేయగా ఒక్క నాడియా పులి తప్ప మిగతా జంతువులు కోలుకున్నాయని తేలింది. దీంతో న్యూయార్క్ లోని బ్రోంక్స్ జూపార్కును మార్చి 16వతేదీ నుంచి మూసివేశారు. పెంపుడు జంతువులు, పశువుల్లో కరోనా వైరస్ ప్రబలడం కొత్త ప్రశ్నలను లేవనెత్తుతుందని జూపార్కు డైరెక్టరు జిమ్ బ్రెహేనీ చెప్పారు. గతంలో హాకాంగ్ లో పెంపుడు కుక్కకు కరోనా వచ్చిందని బయటపడింది. కరోనా వైరస్ తో బాధపడుతున్న నాడియా పులిని ఐసోలేషన్ లో ఉంచి ఇతర జంతువులకు సోకకుండా చూడాలని అమెరికన్ వెటర్నరీ మెడికల్ అసోసియేషన్,ఫెడరల్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధికారులు కోరారు.

Related posts