telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

`మోస్ట్ డిజైరబుల్ మెన్`గా విజయ్ దేవరకొండ

Vijay-Devarakonda

2019 సంవత్సరానికిగాను హైదరాబాద్ టైమ్స్ `మోస్ట్ డిజైరబుల్ మెన్` జాబితాలో విజయ్ దేవరకొండ తొలి స్థానంలో నిలిచాడు. వరుసగా పరాజయాలు ఎదుర్కొంటున్నప్పటికీ విజయ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని దీంతో నిరూపితం అయింది. ఈ జాబితాలో మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ రెండో స్థానంలో నిలిచాడు. గతేడాది మూడో స్థానంలో ఉన్న చెర్రీ ఈ ఏడాది తన స్థానాన్ని మెరుపరుచుకున్నాడు. ఇక, 3,4 స్థానాల్లో వరుసగా రామ్ పోతినేని, ప్రభాస్ నిలిచారు. గతేడాది రెండో స్థానంలో ఉన్న ప్రభాస్ ఈసారి 4వ స్థానానికి పడిపోయాడు. ఇంకా టాప్ 10లో మెగా హీరో వరుణ్ తేజ్, సుధీర్ బాబు, యాంకర్ ప్రదీప్‌ ఉన్నారు.

Related posts